టీడీపీ, జనసేనలకు ఏపీ సీఎం జగన్ సవాల్ విసిరారు.రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు 175 సీట్లలో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు.
తెనాలిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.175 సీట్లలో పోటీ చేసి గెలవగలరా అని ఛాలెంజ్ చేశారు.ఇందుకు చంద్రబాబుకి, దత్తపుత్రుడికి దమ్ముందా అని నిలదీశారు.చంద్రబాబుది పెత్తందారుల పార్టీ అని విమర్శించారు.ఈ క్రమంలోనే ఇరువురికి సవాల్ విసురుతున్నానన్న జగన్ 175 స్థానాల్లో వేర్వేరుగా పోటీ చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.