ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.మూడు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.
అయితే మేఘాలయ, త్రిపురతో పాటు నాగాలాండ్ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల కంటే దారుణ స్థితిలో కాంగ్రెస్ ఉందనే చెప్పొచ్చు.
త్రిపురలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసిన ఫలితం దక్కలేదు.అంతేకాదు ఈశాన్య రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పు, జోడో యాత్ర ప్రభావం ఏ మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.
మరోవైపు త్రిపురలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బిజెపి అడుగులు పడుతున్నాయి.అటు నాగాలాండ్ లో కూడా భారీ ఆధిక్యంలో బీజేపీ కూటమి ముందుకెళ్తుంది.