డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 21 మందికి జైలు శిక్షతో పాటుగా జరిమానా..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 21 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా, మరియు 29 మందికి ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తు విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శనివారం రోజున తీర్పు వెల్లడించినట్లు టౌన్ సి.ఐ రఘుపతి గారు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

 21 People Caught In Drunken Drive Fined Along With Imprisonment.-TeluguStop.com

డిసెంబర్ నుంచి జనవరి 19 తేది వరకు సిరిసిల్ల పట్టణ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 50 మంది మందు బాబులు పట్టుబడగా వారిని సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మందు బాబులకు టౌన్ సి.ఐ ,ట్రాఫిక్ ఎస్.ఐ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేపించారు.

అనంతరం వారిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా క్రింది విధంగా శిక్షలు విధించడం జరిగింది.ఇద్దరికీ మూడురోజుల జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా.ఐదు మందికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కక్కరికి 5000 రూపాయల జరిమానా. 12 మందికి ఒక రోజు జైలు శిక్ష తో పాటు రూ.3000 జరిమానా.ఇద్దరికీ రెండు రోజుల జైలు శిక్ష తో పాటు రూ.3000 జరిమానా.వీరితో పాటుగా 29 మందికి ఒక్కొక్కరికి 3000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…

ప్రతి రోజు పట్టణ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాడం జరిగుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి వారి తల్లితండ్రుల, లేదా కుటుంబ పెద్దల సమక్షంలో కౌన్సెల్లింగ్ ఇవ్వడం జరిగుతుందని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే భవిష్యత్తులో వచ్చే ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశలకు పోలీస్ వెరైఫికేషన్ సమయంలో ఇబ్బందులు కలుగుతాయి అని అన్నారు.

ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube