సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు:

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి సభ్యులు పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా:కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ( Congress party ) సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు.ఆదివారం సిరిసిల్ల అర్బన్ పరిధిలోని ముష్టి పల్లి,భూపతి నగర్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముష్టిపల్లి గాంధీ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నుంచి సుమారు 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 Massive Inclusion In Congress Party In Sirisilla Town, Sirisilla Town, Congress-TeluguStop.com

వారికీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది అని స్పష్టం చేశారు.ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో రూ.500 కే వంటగ్యాస్ సిలిండర్, ఆర్టిసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.పేద ప్రజల సంక్షేమం పట్ల ఇప్పుడున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలను గుర్తించి 15 వేల అంత్యోదయ రేషన్ కార్డులను అందజేసి 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు .

ఇప్పుడున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక అంత్యోదయ రేషన్ కార్డులు కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.అర్హులైన వారిని గుర్తించి కుటుంబంలో ఒకరికైనా పెన్షన్ అందించిన పాపాన పోలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

బీసీలకు లక్ష సాయం అని ప్రకటించిన ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న బీసీలకు ఆన్లైన్లో సర్వర్ డౌన్ అని చెప్పి తహాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు.నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు మూడు రూపాయలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు .గ్రూప్ వన్ , గ్రూప్ టు , గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు ప్రకటించిన ప్రభుత్వం లీకేజీల పేరుతో వాటిని రద్దుచేసి నిరుద్యోగులను గోసపెడుతోందని తీవ్రంగా మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగాలని సంగీతం శ్రీనివాస్ (Singeetam Srinivas )పిలుపునిచ్చారు… ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ లో అయ్యగారి రాజు, బండారి బాలయ్య, బల్ల గానయ్య, అంకం రాజు, ఆడెపు బుచ్చయ్య, ఆకుబత్తిని రామచంద్రం, తడుక బాలకిషన్, మాదాసు రాములు, ఎర్రవెల్లి సాల్మన్ రాజు, హెల్ది కనకయ్య, తిప్పవరం వినయ్, ఎస్కే ఖజా, దస్తగిరి, కాసారపు నారాయణ, కాసారపు సాగర్, కుర్రి విష్ణు, ఎక్కల్దేవి పవన్, సిహెచ్.

రాకేష్, అడ్డగట్ల శేఖర్, భోగ సంగీత్, జడల తిరుపతి, ఎల్ల నిఖిల్, కె.లవన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్,పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిందమ్ శ్రీనివాస్,జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి అకినే సతీశ్, కాంగ్రెస్ నాయకులు అన్నల్ దాస్ భాను,పిట్టల దేవరాజ్, వేముల వేణు,మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube