రాజన్న సిరిసిల్ల జిల్లా:తెలంగాణ దశాభ్ది ఉత్సవాలలో( Telangana decade celebration ) భాగంగా ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan ) ఆదేశాలతో గంభీరావుపేట పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థినీ, విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ( Technology ) గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వి హెచ్ ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్,ఇతర ఆయుధాల గురించి, టీఎస్ కాప్ అందులో ఉన్న ఫ్యూచర్స్ గురించి, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి, వివిధ రకాల బందోబస్తు గురించి, పోగొట్టుకున్న ఫోన్ సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా దొరికే విధానం, ఫింగర్ ప్రింట్ డివైస్, డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్, వివిధ రకాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.