రాజన్న సిరిసిల్ల జిల్లా : మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆదివారం వేములవాడ రూరల్ మండలంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మన్ కీ బాత్ కార్యక్రమన్ని వీక్షించిన బిజెపి మండల నాయకులు.అనంతరం మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ గత నెల క్రితం 100 వ మన్,కీ బాత్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఆదివారం మహా జన సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా మన దేశ ప్రజలందరికీ దేశం యొక్క అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరిస్తూ
అలాగే ఎంతోమందికి ఈ మనకి బాత్ ద్వారా అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుందని, దేశం మొత్తం మన్ కీ బాత్ ద్వారా వివరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్ఛ ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా స్పోక్ పర్సన్ గొపు బాలరాజ్,మండల ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి రవికిషోర్, ఉపాధ్యక్షులు బురుపల్లి పరమేష్,ఏగుర్ల అనిల్, బీజేవైఎం అధ్యక్షులు జంగం వంశీ, ఎస్సీ మోర్ఛ ఉపాధ్యక్షులు మల్లారం తిరుపతి, ఓబిసి ఊపాధ్యక్షులు ఏడుమ్యకల మధుకర్, భూత్ అధ్యక్షులు ఉప్పుల గౌతం,నాయకులు పిట్టల పరుశురాం, ప్రశాంత్తదితరులు పాల్గొన్నారు.







