ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు( Kadiam Srihari, Padi Kaushik Reddy ) శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.

 Schedule For Mlc By-elections Finalized , Mlc By-elections, Kadiam Srihari, Pad-TeluguStop.com

దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది.అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది.19వ తేదీన నామినేషన్ల పరిశీలన,22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు.29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube