రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం( World Braille Day ) సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకంలో గ్రౌండ్ చేసిన యూనిట్లకి లబ్ధిదారులకు చెక్కులు అందించడం జరిగింది… ఈనాడు సఖి కేంద్రం ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారుల ఉద్దేశించి ప్రసంగించారు… ఈ సందర్భంగా వారు హాజరైన దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఆసరా పెన్షన్లతో పాటు వారు నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, ఇతరులతో పోటీపడి జీవించడానికి, అనువైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ తరఫున సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.అలాగే జిల్లాలో ఉన్న ఆర్థిక సహాయం, పునరావాసం అవసరం ఉన్న వ్యక్తులందరికీ అందించడం కోసం వివరాలు సేకరించాల్సిందిగా జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీ రాజం కు సూచించారు.
అలాగే జిల్లాలో ఉన్న వివిధ రకాల లో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ ని ముఖ్యంగా కిరాణం షాపు, తోపుడుబండ్లు, చిరు వ్యాపారాలు బ్యాంగిల్ స్టోర్స్, చెప్పల దుకాణాలు లాంటి చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి గ్రౌండ్ చేయడం జరిగింది.ఆ గ్రౌండింగ్ చేసినటువంటి లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు అందించడం జరిగింది.
అలాగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న పురస్కరించుకొని అప్పుడు ఎన్నికల నియమావళి అమలు లో ఉన్నందున వారికి నిర్వహించిన ఆటల పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరిగింది.వారిని ప్రోత్సహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు…ఈ కార్య క్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై దివ్యంగా భవన్ కు సంబంధించి స్థలాన్ని సేకరించి ఇవ్వడానికి కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపిస్తామని చెప్పడం జరిగింది.జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం మాట్లాడుతూ దివ్యంగులకి ఫ్రీ బస్ పాస్ కోసం వచ్చిన డిమాండ్ ని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది.
అలాగే అవసరం ఉన్న లబ్ధిదారులందరూ కూడా వారికి కావలసిన చేతికి కర్రలు పరికరాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా వారి మొబైల్ లోనే వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఏమైనా ఇబ్బందులు, అనుమానాలు ఉంటే ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్ ను కలవాలని సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిడిపివోలు ఎల్లయ్య సుచరిత, అలేఖ్య, ఆనందిని, డిహబ్ సిబ్బంది రోజా ,సఖి సిబ్బంది విజయ, డిసిపిఓ స్వర్ణలత, పోషణ అభియాన్ బాలకృష్ణ దివ్యాంగ సమితి నాయకులు తిరుపతి రాజేందర్ నరేష్ మొదలగువారు పాల్గొన్నారు
.