అడవి మృగాలలో సింహాలు తరువాత పులులు అత్యంత భయంకరమైన క్రూర జంతువులని ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అందరికీ తెలిసినదే.
అందువలనే వాటితో దాదాపుగా చాలా ఎరుకతో వుంటారు.అయితే కొన్ని దేశాలలో పులులను</em పెంచుకునే సంప్రదాయం ఉంది.
మరీ ముఖ్యంగా థాయ్‌లాండ్, దుబాయ్ వంటి దేశాలలో పులులను సాధారణ జంతువులగానే పరిగణిస్తూ వాటిని పెంచుతుంటూ వుంటారు.అయితే వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని తాజా వైరల్ వీడియో ఒకటి చెబుతోంది.
అవును దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.వైల్డ్ వరల్డ్ గ్రఫీ అనే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ కాగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పులి ఒక దిమ్మ మీద పడుకుని ఉండగా ఆ పులి దగ్గరకు వెళ్లిన ఓ మహిళ ఆ పులిని పట్టుకుని ఆప్యాయంగా నిమిరేందుకు యత్నించింది.అయితే అలా నిమరడం నచ్చిందేమోగానీ కొద్ది సేపటి తర్వాత ఆ పులి ఒక్కసారిగా దూకుడు పెంచింది.
ఆ మహిళ చేయి, కాలును నోటితో పట్టుకుంది.
ఆ మహిళ పక్కకు పోదామన్న పోనీయకుండా ఆ పులి ఆ మహిళకు కొద్ది క్షణాల పాటు చెమటలు పట్టించింది.అయితే ఇక్కడ ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకోక తప్పదు.బెదిరిపోకుండా సహాయం కోసం సైగలు చేసింది.
కంగారు పడితే పులి ప్రమాదకారిగా మారుతుందని గ్రహించిన మహిళ చాలా నేర్పుతో వ్యవహరించింది.ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ప్రస్తుతం షాక్ గురి చేస్తోంది.ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించగా నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు.“ఆమె మూర్ఖత్వానికి తగిన శాస్తి జరిగింది” అని కొందరు కామెంట్ చేస్తే, “ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే” అని కొంతమంది ఆమెకి మద్దతు పలుకుతున్నారు.