అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్ గుండాల దాడి హేయమైన చర్య: ప్రియదర్శిని మేడి

నల్లగొండ జిల్లా:అడ్వకేట్ యుగేందర్ పై బీఆర్ఎస్( BRS ) గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు.సోమవారం ఆమె మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశానికి వెళ్ళి వస్తుండగా దాడి చేయడం హేయమైన చర్యగా మండిపడ్డారు.

 Attack By Brs Goons On Advocate Yugender A Heinous Act Priyadarshini Medi , Priy-TeluguStop.com

తుంగతుర్తి ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు దాడి జరిగిందన్నారు.మంత్రి, ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సర్కారు స్పందించి దాడికి సూత్రధారి అయిన తుంగతుర్తి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి హత్యయత్నం,భౌతిక దాడులను బీఎస్పీ సహించదని హెచ్చరించారు.

ఎమ్మెల్యే భూ దందాలు,ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో జిల్లా రెవిన్యూ,పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు.పథకం ప్రకారమే అధికార పార్టీ గూండాలు దాడి చేశారని  ఆరోపించారు.

కారుపై రాళ్ల దాడి జరిపి, హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.కారును ఎందుకు అడ్డగించారని అడిగేలోపే తన వాహనంపై దాడి చేశారని యుగేందర్ ఆవేదన వ్యక్తం చేశారన్నట్లు చెప్పారు.

భౌతిక దాడులు,హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ప్రశ్నించే వారిపై దాడుల వెనుక జిల్లా మంత్రి జి.జగదీశ్ రెడ్డి, కేటీఆర్,కేసీఆర్( Minister G.Jagadish Reddy, KTR, KCR ) వున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించారు.తుంగతుర్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలు, అధికార పార్టీ నేతల అరాచకానికి అడ్టుకట్ట వేస్తామన్నారు.అడ్వకేట్ పై హత్యయత్నాన్ని రాష్ట్ర బార్ అసోసియేషన్ ఖండించాలసిందిగా కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube