జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గత రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఎప్పుడూ లేని విధంగా పవన్ మాటల్లో ఆందోళన, ఆవేదన కనిపిస్తోంది.ముఖ్యంగా టిడిపితో పొత్తుల విషయంపై పవన్ క్లారిటీ ఇచ్చేశారు.2024 ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఈ విషయంలో బిజెపి ఒప్పుకోకపోయినా ఒప్పిస్తాను అని పవన్ ప్రకటించారు.తమ లక్ష్యం వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమేనని పవన్ క్లారిటీ ఇచ్చారు.ఇక టిడిపి తో జనసేన పొత్తు వ్యవహారాలపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Chairman Nadendla Manohar ) కీలక పాత్ర పోషించారని, ఆయన మొదటి నుంచి చంద్రబాబు మనిషేనని, అందుకే పవన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని సొంత పార్టీ నేతలు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం వంటి వ్యవహారాలు పవన్ దృష్టికి వెళ్లాయి.
అంతేకాకుండా అనేకమంది కీలక నేతలు నాదెండ్ల మనోహర్ విషయంలో నేరుగా తనకి ఫిర్యాదులు చేస్తుండడం వంటి వ్యవహారాలపై తాజాగా పవన్ స్పందించారు.నాదెండ్ల మనోహర్ ను కులం పేరుతో జనసేన నాయకులే విమర్శిస్తున్నారని, అతన్ని టార్గెట్ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని పవన్ హెచ్చరించారు.
నాయకులు తన వద్దకు ఫిర్యాదులు చేయడానికి రావద్దని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రావాలని పవన్ పిలుపునిచ్చారు.తనను తిట్టలేక కొంతమంది నాదెండ్ల మనోహర్ ను తిడుతున్నారని, ఆయనపై తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో పెడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని పవన్ హెచ్చరించారు.
అభిమానం ఓట్లుగా మారితేనే ముఖ్యమంత్రి అవుతానని, అజాతశత్రువును కాను, కొంతమంది నన్ను శత్రువుగా చూసినా ఓకే,.తనను ఎంత విమర్శిస్తే అంతగా రాటు తేలుతానని పవన్ అన్నారు.నాదెండ్ల మనోహర్ తన వెనుక బలంగా నిలబడ్డారని, ఆయనపై ఎంతోమంది విమర్శలు చేసినా సరే, ఆయన ఒక్క మాట మాట్లాడకుండా నిలబడ్డారని పవన్ అన్నారు.ఆయనపై ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా సరే నేను వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని పవన్ హెచ్చరించారు.
జనసేనలో దీర్ఘకాలం పని చేసేవారు కావాలని, కాలక్షేపం చేసేవారు వద్దని, వారికి పదవులు ఇవ్వమని అన్నారు.
పొత్తులపై పూర్తిస్థాయి చర్చలు ఉన్న రోజు మీడియా ముందు కూర్చొని విధివిధానాలు ప్రకటించి, అప్పుడు పొత్తుతో ముందుకు వెళతామని, అంతేకానీ నాలుగు గోడల మధ్య ఒప్పందాలు చేయనని పవన్ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. గత ఎన్నికల్లో 30 నుంచి 40 సీట్లు వచ్చి ఉంటే ఇప్పుడు సీఎం సీటు వచ్చి తీరేది అని, కానీ సీట్లు లేనప్పుడు ఏం చేయగలం అంటూ పవన్ అన్నారు.ఒకే ప్రాంతానికి పరిమితమైన ఎంఐఎం పార్టీకి ఏడు స్థానాలు వచ్చాయని, కానీ జనసేనకు కనీసం 10 స్థానాలైనా రాకపోతే ఎలా అంటూ పవన్ ప్రశ్నించారు.
ఎంఐఎం కు ఏడు స్థానాలు వచ్చాయని, ఎంఐఎంల కాదు కనీసం విజయ్ కాంత్ లా కూడా మనల్ని గెలిపించలేదని పవన్ విచారణ వ్యక్తం చేశారు.