సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు లవ్, డేటింగ్, బ్రేకప్ లాంటివి ఒక అలవాటు అని చెప్పాలి.ప్రతి ఒక్కరి లైఫ్ వెనక ఏదో ఒక బ్రేకప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
ఇక కొంతమంది నటీనటులు తమ బ్రేకప్ గురించి బయటకు వదిలితే మరి కొంతమంది సీక్రెట్ గా ఉంచుతూ ఉంటారు.ఇక వీళ్ళ లైఫ్ లో ఇవన్నీ కామన్ అని జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు.
నిజానికి ఒకప్పుడు వీళ్లకు బ్రేకప్ అయ్యిందంటే చాలు నానా హంగామా చేసే వాళ్ళు జనాలు.ఇప్పుడు అలా కాదు.
వాళ్ళు ఎక్కడ పోతే మనకేంటి అన్నట్లుగా ఉన్నారు.ఎందుకంటే నటీనటుల వ్యవహారాలు అలా ఉంటాయి కాబట్టి.
ఒకవేళ వాళ్ళు ఒకరితో బ్రేకప్ అయ్యాక కూడా సైలెంట్ గా ఉంటారు అనుకోవడం పొరపాటు.వెంటనే మరొకరిని లైన్లో పెట్టేస్తూ ఉంటారు.
అసలు గ్యాప్ అనేది ఇవ్వకుండా ఒకరి తర్వాత ఒకరికి భలే ప్రేమలు పంచుతూ ఉంటారు.ఇక అందులో లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) అని చెప్పాలి.
ఈమె నటిగా ఎంత పేరు తెచ్చుకుందో వ్యక్తిగతంగా అంత హాట్ టాపిక్ గా నిలిచింది.అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్ లు మామూలుగా లేవని చెప్పాలి.
ఏకంగా బాయ్ ఫ్రెండ్ తో ముద్దు పెట్టుకున్న ఫోటోలే మీడియాల ద్వారా బయటపడ్డాయి.
ఇప్పుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్( Director Vignesh Sivan ) ను పెళ్లి చేసుకొని మొత్తానికి పెళ్లి జీవితంలో సెటిల్ అయింది కానీ అప్పట్లో కొంతమంది హీరోలతో బాగా రచ్చ రచ్చ చేసింది ఈ బ్యూటీ.కెరీర్ మొదట్లోనే తమిళ స్టార్ హీరో శింబు( Simbu )తో బాగా రచ్చరంబోలా చేసింది నయనతార.ఏకంగా అతనితో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఇక వీరు పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.కానీ ఏం జరిగిందో తెలియదు విడిపోయారు.
అంతటితో ఆగకుండా వెంటనే పెళ్లయిన మగాడి వెంటపడింది ఈ బ్యూటీ.అదేనండోయ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ( Choreographer Prabhudeva )తో కూడా ప్రేమ వ్యవహారం నడిపించింది.అప్పటికే ఆయనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ అతడితో పెళ్లికి కూడా రెడీ అయింది.కానీ అతనితో కూడా బ్రేకప్ చెప్పుకుంది ఈ బ్యూటీ.
ఇక వీరిద్దరి తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ వెంటపడిందని మనకు తెలుసు.కానీ కొన్ని మీడియా వార్తల ప్రకారం.ప్రభుదేవా తర్వాత ఒక మంత్రి తో కూడా ప్రేమాయణం నడిపిందట.ఇక ఆ మంత్రి ఎవరో కాదు.కోలీవుడ్ హీరో ఉదయనిది స్టాలిన్( Kollywood hero Udayani Stalin ).ఈయనతో కూడా కొంతకాలం ఎఫైర్ నడిపించింది అని రీసెంట్ గా బీజేపీ నేత ధారారవి బయట పెట్టాడు.
నయనతారతో ఉదయనిధికి ఎఫైర్ ఉందని.ఈ విషయం గురించి మాట్లాడినందుకే తనను డీఎంకే పార్టీ నుంచి బయటికి పంపించారని అన్నాడు.అంతేకాకుండా వారిద్దరు సహజీవనం చేస్తున్నారని కూడా షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.ఇక ఈ వార్త అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వైరల్ అవ్వటంతో అంటే ఇప్పటికీ నయనతార అతనితో సహజీవనం చేస్తుందా అని అనుమానం పడుతున్నారు.