నందమూరి నటసింహం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”NBK108”.ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం కంటే ఎక్కువ పూర్తి కాగా మిగతా భాగం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
మరి షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం సక్సెస్ జోరులో ఉండడంతో మరో హిట్ ఖాయం అంటూ అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ప్రజెంట్ బాలయ్య( Balakrishna ) ఇమేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి.మరి ఈయన ఇమేజ్ కు తగ్గ యాక్షన్ కథను అనిల్ రెడీ చేసాడని.
ఏమాత్రం అభిమానులను నిరాశ పర్చకుండా తెరకెక్కిస్తున్నాడు అని టాక్.ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ పై ఒక సమాచారం బయటకు వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని.ఈ షెడ్యూల్ లో బాలయ్యపై పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ సినిమా ఫైట్స్ జరుగుతున్నాయి.మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే కీలకం అని ఈ సీన్ లో బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేస్తారట.
బాలయ్య ఇప్పటి వరకు కెరీర్ లో చేయని విధంగా ఈ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట.
మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు రెండు వారాల పాటు సాగనుందని అంటున్నారు.మరి రెండు వారాలు ఈ ఫైట్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు అంటేనే ఇది ఎంత కీలకం అని అర్ధం అవుతుంది.ఇక ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విధంగానే ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయట.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal )హీరోయిన్ గా నటిస్తుండగా.బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల( Sreeleela ) కనిపిస్తున్న విషయం విదితమే.
ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్( Arjun Rampal ) నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.అలాగే ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవ్వనుంది.