తమ భూమిని ఆక్రమించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకొని సర్పంచ్ భర్త లంజపల్లి వెంకన్న తన అనుచరులతో పంచాయతీ పెట్టించడం, ఎదిరించటం దాడులకు పాల్పడటం జరుగుతుందని తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన బరపట్ల ఉమా, జనార్ధన్, మట్టే మహేష్ పేర్కొన్నారు.గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మాభూమి పంపకాల్లో మాకు అన్యాయం చేసేందుకు, దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించుకునేందుకు జూపెడ గ్రామ సర్పంచ్ భర్త పల్ల వెంకన్న తన అనుచరులతో దాడికి పాల్పడడంతో తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు రాత్రి 12 గంటల ఆ సమయంలో జూపెడ వెళ్లినప్పుడు సర్పంచ్ భర్త ఎంపీటీసీ భర్త శ్రీను, కనకయ్యలు దాడిచేసిన వారిని దాచిపెట్టి పోలీసులకు నచ్చజెప్పి పంపించారని వారు వాపోయారు.
మరల ఉదయం సర్పంచ్ భర్త వెంకన్న, ఎంపీటీసీ భర్త శ్రీను, మాజీ జెడ్పిటిసి కనకయ్యలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, వారి వలన మాకు ప్రాణభయం ఉందని పేర్కొన్నారు.జిల్లా అధికారులు అట్టి వారి పై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరారు.