యాదాద్రి జిల్లా:ఏప్రిల్ 9 న జరిగే రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరి కార్యక్రమానికి సన్నాహక సదస్సును శనివారం సాయంత్రం భువనగిరి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జ్ చంద్రస్వామి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్యాతిథులుగా టీజేఏస్ అధినేత ప్రొ.
కోదండరాం,రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ మందకృష్ణ మాదిగ,యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీంపాష హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల నాయకులు,మేధావులు,ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.