అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పడం ఎవరి తరం కాదేమో.ఎందుకంటే అప్పటి వరకు సామాన్య జనం లాగా ఉన్న వారు కూడా సడెన్‌గా కోటీశ్వరులు కావడాన్ని మనం గమనించవచ్చు.
ఇక కొందరికి లాటరీల ద్వారా అదృష్టం కలిసి వస్తే మరి కొందరికేమో ఏదో ఒకటి దొరకడం ద్వారా కోటీశ్వరులు కావడాన్ని మనం చూడొచ్చు.ఇప్పుడు కూడా ఇలాగే ఓ కుటుంబం రాత్రికి రాత్రే ఏకంగా కోటీశ్వరులు అయిపోయారు.
వారి ఇంట్లో ఉన్న గిన్నెను ఎందుకూ పనికి రాదని మూలకు పెట్టగా.చివరకు ఆ గిన్నె నే వారికి కోట్లు తెచ్చి పెట్టింది.
కాగా ఈ అనూహ్య ఘటన స్విట్జర్లాండ్ లో జరిగినట్టు తెలుస్తోంది.స్విట్జర్లాండ్‌లో నివాసం ఉంటున్న ఓ జంట అనుకోకుండా ఒక రోజు మార్కెట్‌కు వెళ్లగా వారికి ఎందుకో అక్కడ అమ్ముతున్న పాత గిన్నెను కొనాలనిపించింది.
దానిమీద ఉన్న ఆసక్తికరమైన డిజైన్ వారిని కొనేలా చేసింది.ఇక అమ్మకం దారుడు కూడా ఆ గిన్నె ఎందుకూ పనికిరానిది వారికి చాలా అంటే చాలా తక్కువ ధరకే అమ్మడం, ఇక దాన్ని ఈ జంట కొనుక్కోవడం జరిగిపోయింది.
ఆ గిన్నెను కొన్న తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించారు.
అయితే తమకు ఎందుకో అది చాలా పురాతన మైన గిన్నెగా అనిపించడంతో వేలం వేయాలని డిసైడ్ అయ్యారు.
చాలా చోట్ల దాన్ని వేలానికి పెట్టగాఎవరూ ముందుకు రాలేదని వారు విసిగిపోయారు.కానీ చివరకు వారికి ఒక ఫోన్ కాల్ రావడం.
అతను కూడా వేలం వేసే నిపుణుడు కావడంతో ఆ గిన్నె గురించి ఆరా తీయడం జరిగింది.ఇక అతను దాన్ని చూసి 17వ శతాబ్దానికి చెందినదని గుర్తించి అతనే అధికారికంగా వేలానికి పెట్టగా ఏకంగా రూ.34.5 కోట్లకు అమ్ముడు పోయింది.దీంతో ఇప్పుడు వారు కాస్త రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు.