చెస్‌లో మనకు వినిపించే ఒకే ఒక్క పేరు కోనేరు హంపి.ఇప్పటికే ఎన్నో వరల్డ్ రికార్డులను సాధించి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఆయన పోటీలోకి దిగితే అవతలి వాళ్లు తడబడాల్సిందే.అలాంటి వ్యక్తి ఇప్పుడు మరో ఘటన సాధించాడు.2022లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ రేసులో చోటు సంపాదించాడు హంపీ.
ఈ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కోనేరు హంపి స్థానం సంపాదించాడు.
గతేడాది కూడా మహిళల గ్రాండ్ ప్రీ సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి 293 పాయింట్లతో ఈ టోర్నీలోనే రెండో స్థానంలో నిలవడంతో ఆమెకు క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది.అలాగే హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించడం ఇక్కడ విశేషం.
ఇక వచ్చే ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ టోర్నీలో విజేగా నిలిచిన వారు 2022 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జూ వెన్‌జున్ (చైనా)తో పోటీ పడతారు.ఇక గ్రాండ్ ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీల్లో చివరిదైన జిబ్రాల్టర్ టోర్నీ బుధవారం ముగిసింది.ఇక ఈ టోర్నీలో మన హంపీ పోటీ చేయకపోయినా అంతకు ముందు ఆడిన రెండు టోర్నీల్లో ఆయన అద్భుతమైన ప్రదర్శన చేశారు.
ఇక ఆయన లేకుండా ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది.అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్–3లో నిలువడంతో హంపికి బెర్త్ ఖరారైంది.
ఈ హంపీ చెస్ ఛాంపియన్ షిప్‌లో చోటు సంపాదించుకున్నాడు.