సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై వేధింపులు రెగ్యులర్ గా జరుగుతున్నవే.ఈ మధ్య కాలంలో మీటూ మాటిన సినిమా ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపులపై నటీమణులు గళం విప్పారు.
ఇప్పటికే చాలా మంది తమ జీవితంలో ఎదురైన అనుభవాలని మీడియాతో పంచుకున్నారు.ఒక్కొక్కరుగా హీరోయిన్స్ కూడా బయటకి వస్తూ కెరియర్ ఆరంభంలో తనకి ఎదురైనా లైంగిక వేధింపులపై నోరు విప్పుతున్నారు.
అయితే తమని వేధించిన వారి పేర్లు బయట పెట్టకపోయినా తమకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.ఎలా లైంగిక వేధింపులకి పాల్పడ్డారు అనే విషయాలని పంచుకున్నారు.
తాజాగా మరాఠీ స్టార్ హీరోయిన్, సౌత్ లో కూడా హీరోయిన్ గా రాణిస్తున్న శృతి మరాతే అనే హీరోయిన్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఒక సినిమాకు ఒప్పుకునే ముందు నిర్మాత చిరాకు పెడుతుంటే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది.
సాధారణంగా ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాను అక్కడి నుంచి వెళ్లిపోతానని, కానీ ఆ నిర్మాతకు మాత్రం కౌంటర్ ఇచ్చానని తెలిపింది.ఆ నిర్మాత తనను కాంప్రమైజ్ అవ్వాలని, ఒక రాత్రి పడుకోవాలని చెప్పాడని శృతి మరాతే హాట్ కామెంట్స్ చేసింది.
అతని మాటలతో నాకు చిరాకు వేసి హీరోను కూడా ఇలాగే అడిగావా, అతను కూడా పడుకోవాలా, అలా అయితేనే మీ సినిమాలో అవకాశం ఇస్తావా అని నిర్మాతకు మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది.ఆ మాటలతో నిర్మాత ఆ సినిమా నుంచి నన్ను తప్పించాడని చెప్పింది.
తాను దానికి బాధపడలేదని ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉండి మన విలువల్ని కాపాడుకోవాలని శృతి తెలిపింది.