వ్యభిచారం చేయాలంటూ పెళ్ళైన మహిళకు మూడు వేల ఫోన్ కాల్స్

హైదరాబాద్ లో ఆన్ లైన్ వ్యభిచారాలకు పాల్పడుతున్న ముఠా ఆగడాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి.ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు తెలియని నంబర్లకి ఫోన్లు చేస్తూ వ్యభిచారం చేయాలంటూ, అలాగే వ్యభిచారం చేస్తూ రోజుకి 20 నుంచి 30 వేల రూపాయలు సంపాదించ వచ్చంటూ అమాయక మహిళలకు ఆశ చూపించి వారిని మెల్లగా వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.

 Married Women Got Three Thousand Calls-TeluguStop.com

  తాజాగా హైదరాబాదులోని ఓ ప్రాంతంలో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు.
 

అయితే వీరికి ఈ నెల 15వ తారీఖు నుంచి ఇద్దరు మహిళలు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అలాగే తన భార్యతో వ్యభిచారం చేయించాలని దీనికి గానూ రోజుకి చాల మొత్తంలో డబ్బు సంపాదించవచ్చంటూ వేధిస్తున్నారని పోలీసులను ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు.

 Married Women Got Three Thousand Calls-వ్యభిచారం చేయాలంటూ పెళ్ళైన మహిళకు మూడు వేల ఫోన్ కాల్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటి వరకూ ఆ మహిళలు తనకు 3000 కాల్స్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు చూపించి ఫిర్యాదు చేసాడు.అంతేగాక తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ను వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసి అసభ్యకర సందేశాలు, అశ్లీల వీడియోలు పంపిస్తూ నరకం చూపిస్తున్నారని, అలాగే తమది పరువుగల కుటుంబమని ఈ విషయం గురించి బయటికి తెలిస్తే తమ పరువు పోతుందని ఆ భర్త పోలీసుల ఎదుట వాపోయాడు.
 

అయితే  ఇలాంటి తరహా కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నమోదయ్యింది.తన సోదరికి గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు, సందేశాలు పంపిస్తున్నారంటూ ఈ వ్యక్తి మియాపూర్ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.దీంతో బాధితుల వివరాల కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని ఛేదించే పనిలో పడ్డారు.అంతేగాక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినా, లైంగిక వేధింపులకు పాల్పడే కాల్స్ వచ్చినా వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

#HyderabadLocal #Married Women #Hyderabad #HyderabadCrime #MarriedWomen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు