డెమోక్రటిక్ పార్టీ ప్రవేశపెట్టిన అభిశంసన విచారణకి తాను సిద్దంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ కూడా చేశారు.
తనపై మోపిన అభియోగాలకి సంభందించిన అభిశంసన ఎదుర్కోవడానికి నేను వెనుకాడనని, సెనేట్ లో డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోవడం ఖాయమని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
తనపై మోపిన అభియోగాలు ఋజువు చేసేందుకు డెమోక్రటి పార్టీ దగ్గర ఆధరాలు లేవని, ఈ అభియోగం వీగిపోవడం ఖాయమని అన్నారు.
అంతేకాదు అభిశంసన కి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా రిపబ్లికన్ వైపు నుంచీ పడలేదని, ఇక సెనేట్ లో అభియోగా ఎలా నెగ్గుతుందని అన్నారు.గతంలో కంటే కూడా ఇప్పుడు రిపబ్లికన్స్ ఎంతో ఐక్యమత్యంగా ఉన్నారని ట్వీట్ చేశారు.

తాజాగా మెక్సికోతో జరిగిన ఖండాంతర వాణిజ్యానికి దిగువ సభలోనే భారీ మద్దతు వచ్చిందని, 385 ఓట్లు రాగా కేవలం 41 మాత్రమే వ్యతిరేక ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఈ అభిశంసన కూడా ఇలానే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్.ఏది ఏమైనా డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన ఈ అభిశంసన వీగిపోవడం కాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.