ప్రపంచ దేశాల్లో రకరకాల తెగలు ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.ఒకొక్క తెగ కు ఒక్కొక్క రకమైన ఆచారాలు ఉంటూ ఉంటాయి.
పెళ్లి విషయంలో కొన్ని దేశాలు ఆచరించే విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి.టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా ఇలాంటి కొన్ని ఆచారాలను చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది.
ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ దేశంలోని డింకా, న్యూర్ తెగలకు చెందిన ఒక విషయం విచిత్రంగా అనిపిస్తుంది.ఆ తెగలకు చెందిన మహిళలకు విచిత్రమైన పద్దతిలో వివాహం చేస్తూ ఉంటారు.
ఏ ఇంట్లో అయినా మరణించేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తిని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు.అదేంటి ఇంత విచిత్రంగా ఎవరైనా పెళ్లి చేసుకొని భర్త తో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటారు, కానీ ఇదేంటి అని ఆలోచిస్తున్నారా.
ఇంకా ఆ తెగ వారు కన్యాశుల్కం అనే పద్దతిని ఫాలో అవుతున్నారు.దానిలో భాగంగానే ఇలా మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటే భారీగా డబ్బులు తీసుకొనే అవకాశం ఉంటుంది అన్నమాట.
అందుకే ఇలా మరణానికి సిద్ధంగా ఉన్నవారికి తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి భారీ గా కానుకలు అందుకుంటూ ఉంటారట.మరో విశేషం ఏమిటంటే ఒక వేళ చనిపోయిన శవం ఉన్నా సరే పెళ్లి చేయడానికి సిద్ధమైనా చేసేస్తూ ఉంటారట.
అయితే శవం తో పెళ్లి చేయడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.

ఇలా శవాన్ని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి కి మరొక ఆఫర్ కూడా ఇస్తారు.ఒకవేళ ఆ అమ్మాయి పిల్లలు కనాలి అని అనుకుంటే అతని కుటుంబంలోని తమ్ముని తో గాని,అన్నతో గాని పిల్లలను కనే అవకాశం ఉంటుందట.ఇలాంటి విచిత్రమైన పెళ్లిళ్ల గురించి వింటే మాత్రం నిజంగా ఆశ్చర్యపోక మానరు.
అలానే ఎవరైనా పెళ్లి చేసుకున్న తరువాత తప్పనిసరిగా ఇద్దరు పిల్లలను కనాలి,లేదంటే మరో మహిళను వివాహం చేసుకొనే అవకాశం ఆ పెళ్లి కొడుకుకు ఇస్తారట.