ఇన్వెస్టర్లకు జేబీఎం ఆటో( JBM Auto ) భారీ లాభాలను పంచింది.ఆ కంపెనీకి 5000ల ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ రావడంతో షేర్ హోల్డర్లు పండగ చేసుకుంటున్నారు.
ఈ ప్రభావం ఆ కంపెనీ షేర్లపై పడింది.దీంతో జూలై 14న బీఎస్ఈ (బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజీ)లో( BSE ) జేబీఎం షేర్లు రాకెట్‌లా దూసుకెళ్లాయి.17.7 శాతం ర్యాలీ చేసి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.1,548.35ను తాకింది.వివిధ రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ల నుంచి 5 వేల బస్సుల ఆర్డర్ రావడంతో ఆ కంపెనీ దశ తిరిగింది.దాని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, కంపెనీ ఇలా పేర్కొంది.“జేబీఎం ఆటో లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలకు గుజరాత్, హర్యానా, ఢిల్లీ,
తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లోని వివిధ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనిట్‌లకు సరఫరా చేయడానికి సుమారు 5000 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్‌లను అందుకున్నాయి. సిటీ బస్సులు, స్టాఫ్ బస్సులు, టార్మాక్ కోచ్‌లు మొదలైన రెండు, 9 మీటర్లు, 12 మీటర్ల కేటగిరీలు వంటి విభిన్న అప్లికేషన్‌లు డెలివరీ చేయబడతాయని కంపెనీ తెలిపింది.చివరికి జేబీఎం షేరు( JBM Shares ) 10.44 శాతం పెరిగి 1,452.35 స్థాయిల వద్ద ట్రేడ్ అయింది.జేబీఎం కంపెనీకి ఈ స్థాయిలో ఆర్డర్ రావడం వెనుక చాలా కారణాలున్నాయి.స్వదేశీంగా అభివృద్ధి చేయబడిన వాహన సాంకేతికత, బ్యాటరీ సాంకేతికత,
ఛార్జింగ్ సొల్యూషన్‌లతో ఎండ్-టు-ఎండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్ ప్రొవైడర్‌గా తన స్థానాన్ని ఆ కంపెనీ మరింత పటిష్టం చేసుకుంటోంది.ఎలక్ట్రిక్-మొబిలిటీ డొమైన్‌లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలను అందించడానికి సిద్ధంగా ఉంది.గత 12 నెలల్లో, కంపెనీ షేర్లు 256 శాతం పెరిగాయి.కీలకమైన ఆటో సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బస్సుల తయారీలో జేబీఎం అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలలో 25 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కలిగి ఉంది.