బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh khan ) ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో జవాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా దీపికా పదుకొనే కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆల్రెడీ ట్రైలర్ లో నయనతార( Nayanthara )దీపికలు రివీల్ అయ్యారు.కానీ షారుఖ్ జవాన్ లో 3వ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వాని( Kiara Advani ) అని తెలుస్తుంది.
ఈమధ్య సినిమాలు వెబ్ సీరీస్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కియరా బాలీవుడ్ లో దూసుకెళ్తుంది.షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో కూడా ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.
ప్రత్యేకంగా కియరానే తీసుకోవడానికి కారణం ఏంటంటే జవాన్ సౌత్ లో కూడా భారీ రిలీజ్ అవుతుంది.కియరా అద్వానికి ఆల్రెడీ తెలుగులో మంచి క్రేజ్ ఉంది.ఇక్కడ రెండు సినిమాల్లో నటించింది కాబట్టి అమ్మడికి ఇక్కడ పాపులారిటీ వచ్చింది.
జవాన్ కి కియరా అద్వాని అలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.