మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) ప్రమాదం జరిగిన తర్వాత కోలుకొని తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు.ఈ క్రమంలోనే విరూపాక్ష ( Virupaksha ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈయన తన మామయ్య పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో నటించినా బ్రో సినిమా(Bro Movie) విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
ఇందులో భాగంగానే సాయి ధరంతేజ్ తాజాగా కడప అమీన్ దర్గాకు( Ameen Darga ) వచ్చారు.ఇక్కడ దర్శించుకున్నటువంటి సాయి తేజ్ అనంతరం పలు విషయాల గురించి ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ కడపకు వస్తే దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ ఆ ప్రమాదం ( Road Accident ) నుంచి బయటపడటం నాకు ఓ పునర్జన్మ.ఇలా భగవంతుడు నాకి పునర్జన్మను ఇవ్వడంతో సమయం కుదిరినప్పుడల్లా ఇలా ఆలయాలకు వెళుతూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు.అనంతరం సినిమాల గురించి పలు విషయాలు తెలియజేశారు.పవన్ మామయ్యతో కలిసి బ్రో సినిమాలో నటించడం ఒక అందమైన అనుభూతి.ఇలా మామయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ(J anasena Party) ని స్థాపించిన విషయం మనకు తెలిసిందే.అందుకే సాయిధరమ్ తేజ్ కూడా రాజకీయాలలోకి వస్తారా అన్న ప్రశ్న తలెత్తుతుంది.అయితే ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ చాలామంది నన్ను పవన్ మామయ్య జనసేన పార్టీలోకి వస్తారా అని అడుగుతున్నారు.
రాజకీయాల( Politics ) పై ఆసక్తి అవగాహన ఉంటే తనని రాజకీయాలలోకి రమ్మని మామయ్య చెప్పారు.కానీ నాకు రాజకీయాల కంటే సినిమా రంగం అంటేనే ఇష్టం ఇక్కడే ఉంటాను.
మామయ్య కూడా అదే చెప్పారు నాకు మావయ్య అంటే చాలా ప్రాణం అంటూ పవన్ కళ్యాణ్ గురించి సాయి ధరమ్ తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.