టాలీవుడ్ సినిమాల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి సంచలనం క్రియేట్ అయిన సమయంలో తనకు వచ్చే గుడ్ మార్నింగ్ మెసేజ్ లు ఆగిపోయాయని జ్యోతి తెలిపారు.
ఆ సమయంలో తాను బాగానే డిబేట్ లలో పాల్గొన్నానని జ్యోతి చెప్పుకొచ్చారు.నేను క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి నా ఒపీనియన్స్ చెప్పానని ఇతరుల ఒపీనియన్స్ తో నాకు పనిలేదని జ్యోతి పేర్కొన్నారు.
తన గురించి చాలా ఆరోపణలు వచ్చాయని అయితే తనేంటో తనకు బాగా తెలుసని జ్యోతి అన్నారు.నేను ఏది ఉన్నా మొహం మీదే మాట్లాడతానని ఫేక్ గా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని జ్యోతి వెల్లడించారు.
ఫేక్ లైఫ్ ను తాను ఏ మాత్రం ఇష్టపడనని జ్యోతి పేర్కొన్నారు.బాబును తానే చూసుకుంటున్నానని జ్యోతి అన్నారు.ఒకసారి లైఫ్ లో దెబ్బ తిన్న తర్వాత మళ్లీ వివాహానికి సంబంధించి డేర్ స్టెప్ ను తీసుకోవాలని తనకు అనిపించలేదని జ్యోతి చెప్పుకొచ్చారు.
ఒక కేసులో తనను ట్రాప్ చేశారని డ్రగ్స్ కేసును కప్పిపుచ్చడానికి ఈ విధంగా చేశారని జ్యోతి వెల్లడించారు.
ఆ అమ్మాయి ఫేమస్ కాదని తన పేరు పెట్టి కేసును హైలెట్ చేశారని జ్యోతి పేర్కొన్నారు.నాకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్లు అనుభవిస్తున్నారని తాను చూస్తున్నానని జ్యోతి వెల్లడించారు.ఎవరైతే బాధ పెట్టారో వాళ్ల మదర్ చనిపోవడం, వైఫ్ చనిపోవడం జరిగాయని జ్యోతి చెప్పుకొచ్చారు.నన్ను వేధింపులకు గురి చేసిన ఒక్కరు కూడా బాగు పడలేదని జ్యోతి పరోక్షంగా తెలిపారు.
తాను భర్తతో డైవర్స్ తీసుకున్నానని జ్యోతి పేర్కొన్నారు.ఆ సమయంలో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని జ్యోతి అన్నారు.మా నాన్న అడ్వకేట్ అని జ్యోతి పేర్కొన్నారు.నాన్న తనను ఎంతగానో సపోర్ట్ చేసేవారని జ్యోతి కామెంట్లు చేశారు.