రకరకాల వంటలు చేయడం ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది అనే చెప్పాలి.చిత్ర విచిత్రమైన వంటలు చేసి అందరి దృష్టిని ఆకర్షించడానికి చెఫ్ లు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వింత పకోడీ ఒకటి నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.పకోడీ అంటే ఎవరికన్నా గుర్తు వచ్చేది ఉల్లిపాయ గాని, అరటికాయ.
అలాగే మరి కొంతమంది బ్రేడ్ తో కూడా పకోడీలు వేస్తూ ఉంటారు.కానీ ఇంతవరకు చెఫ్‌లు చేసే సరికొత్త రకాల పకోడిలను మనం చూశాం.
కానీ మీరు ఎప్పుడన్నా బిస్కెట్స్ తో చేసిన పకోడిలను రుచి చూసారా.
ఏంటి బిస్కెట్స్ తో పకోడీలు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.
కానీ ఒక వ్యక్తి మాత్రం ఇలా ఒరియో బిస్కెట్స్ తో పకోడీలు వేసి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.అసలు బిస్కెట్ తో పకోడీ ఎలా తయారు చేస్తారు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు ఈ బిస్కెట్ పకోడీలను ఎక్కడ వేస్తున్నారంటే అహ్మదాబాద్ లో గల ఒక స్ట్రీట్ ఫుడ్‌లో ఈ ఓరియో పకోడిలను తయారు చేస్తున్నారు.
మనం ఎలాగయితే ఒక గిన్నెలో శనగపిండిని కలిపి అందులో మనకు కావలిసిన ఐటమ్ ను వేస్తామో.అలాగే ఈ శనగపిండి మిశ్రమంలో కూడా ఓరియో బిస్కెట్ ని తీసి శనగపిండిలో ముంచి సల సలా కాగుతున్న ఆయిల్ లో వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి తీసేయడమే ఇక్కడ ఉన్న వంట వ్యక్తి చేసే పని.అలాగే ఈ ఓరియో బజ్జిలకు మంచింగ్ గా వేయించిన పచ్చిమిర్చి తోపాటు, ఖర్జురం చట్నీ కూడా ఇస్తున్నాడు.కాగా ఒక ప్లేట్ ఓరియో పకోడి ధర కేవలం 20 రూపాయిలు మాత్రమే.ప్రస్తుతం ఈ ఒరియో వంటకు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఎవరికీ నచ్చిన కామెంట్స్ వారు పోస్ట్ చేస్తున్నారు.
మరి మీరు కూడా ఒకసారి ఈ ఒరియో వంటకాన్ని రుచి చూసి ఔరా అని అనేయండి మరి.