పవన్ " సింగిల్ " గా డిసైడ్ అయ్యారా ?

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో( AP State Politics ) ప్రస్తుతం జనసేన పార్టీ( Janasena party ) గురించిన చర్చే అధికంగా జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? ఏ పార్టీతో జట్టు కట్టబోతుంది ? పవన్ ఎన్ని స్థానాల్లో బరిలో నిలవబోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలు జనసేన చుట్టూ తిరుగుతున్నాయి.వైసీపీని( YCP ) గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న పవన్.అందుకోసం ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే పొత్తుల విషయంలో ఎన్నోసార్లు స్పష్టతనిచ్చిన పవన్ తాను పోటీ చేసే స్థానాలపై మాత్రం స్పష్టతనివ్వడం లేదు.వైఎస్ జగన్( Jagan ) కు పిలివెందుల, చంద్రబాబు నాయుడు( Chandrababu naidu ) కు కుప్పం.

 Is Pawan Going To Enter The Ring As A Single Details, Pawan Kalyan,janasena,chan-TeluguStop.com

ఇలా కంచుకోటగా ఉండే నియోజిక వర్గం పవన్ కు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్.

ఏ ఒక్క స్థానం లో కూడా గెలుపు సొంతం చేసుకోలేదు.

Telugu Ap, Bhimavaram, Bhivaram, Chandrababu, Gajuvaka, Janasena, Pavan Kalyan,

రెండు స్థానాల్లో కూడా ఘోర ఓటమిని చవి చూశారు.దీంతో తనకంటూ ప్రత్యేక నియోజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పవన్ ఫెయిల్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.అయితే వచ్చే ఎన్నికలపై ఈసారి గట్టిగా దృష్టి పెట్టిన పవన్.

తాను పోటీ చేసే నియోజిక వర్గంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.అయితే గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఈసారి ఎన్నికల్లో రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో పక్కా తాను గెలిచే నియోజిక వర్గాన్ని ఈసారి పవన్ ఎంచుకొనున్నారట.

అయితే గత ఎన్నికల్లో రెండు నియోజిక వర్గాల్లో పోటీ చేసిన పవన్.ఈసారి మాత్రం సింగిల్ స్థానంలోనే బరిలో నిలవనున్నారట.

Telugu Ap, Bhimavaram, Bhivaram, Chandrababu, Gajuvaka, Janasena, Pavan Kalyan,

ప్రస్తుతం పవన్ ముందు భీమవరం( Bhimavaram ) మాత్రమే మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నియోజిక వర్గంలో గత ఎన్నికల్లో ఓటమిపాలు అయినప్పటికి, మళ్ళీ ఇదే నియోజిక వర్గంవైపే పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం.అలాగే పవన్ అభిమానులు అధికంగా ఉన్న ప్రాంతాలలో భీమవరం కూడా ఒకటి.అంతేకాకుండా గతంతో పోల్చితే ప్రస్తుతం భీమవరంలో పవన్ గ్రాఫ్ బాగా పెరిగింది.అందుకే రెండు నియోజిక వర్గాల్లో పోటీ చేయడం కన్నా కచ్చితంగా గెలవగలిగే భీమవరంలో మాత్రమే పోటీకి దిగాలని పవన్ డిసైడ్ అయినట్లు పోలిటికల్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.

మరి దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube