బీఆర్ఎస్( BRS ) లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఈటెల రాజేందర్( Etela Rajender ) ఆ తరువాత ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బిజెపిలో చేరడం, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం వంటివి జరిగాయి.ఈటెల రాజేందర్ కు ఉన్న అనుభవం ను దృష్టిలో పెట్టుకుని ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించారు.
రాజేందర్ ద్వారా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బిజెపి అగ్రనేతలు రాజేందర్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు.అయితే రాజేందర్ ఆ బాధ్యతలు స్వీకరించినాm ఆశించిన స్థాయిలో బిజెపిలోకి చేరికలైతే కనిపించడం లేదు.
ఈ చేరికల ద్వారానే తన ప్రాధాన్యం పెంచుకొని బిజెపి( BJP ) ఆగ్రనేతల వద్ద మార్కులు కొట్టేయాలని చూసిన రాజేందర్ కు చేరికలు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీలో( BJP ) గ్రూపు రాజకీయాలు బయలుదేరడం, రాబోయే రోజుల్లో సీఎం కుర్చీ విషయంలో తాను పోటీలో ఉంటాననే భయంతో ముందుగానే తన ప్రభావం పెరగకుండా పార్టీలోని కొంతమంది నేతలు ప్రయత్నిస్తుండడం వంటి వాటిపై రాజేందర్ ఆందోళనతోనే ఉంటూ వస్తున్నారు.ఇక తాను బాధ్యతలు నిర్వహిస్తున్న చేరికల కమిటీ చైర్మన్ పదవికి సరైన న్యాయం చేయలేని పరిస్థితిలో రాజేందర్ ఉన్నారు.చేరికల విషయంలోనూ ఎవరికి ఎటువంటి హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం, టిక్కెట్ల కేటాయింపు విషయంలో సొంతంగా హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.
దీంతో బిజేపిలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించినా, అవి అంత ఆశాజనకంగా లేకపోవడంతో రాజేందర్ పలుకుబడి బిజెపి అగ్రనాయకత్వం వద్ద తగ్గింది.
ఈ విషయంలో రాజేందర్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు.అయితే సొంతంగా టిక్కెట్ల హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం , టికెట్ల హామీ లేకుండా ఇతర పార్టీల నేతలు బీజేపీ లో చేరే సాహసం చేయలేకపోవడంతోనే బీజేపీ లో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.