తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేస్తోందని చెప్పారు.
ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని ఆమె ఆరోపించారు.ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
అంతేకాకుండా తప్పులపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.అపోజిషన్ పై దాడి చేస్తే ఏం జరుగుతుందన్న కవిత మహా అయితే ఒక టర్మ్ అధికారం పోతుందేమోనని తెలిపారు.
లీకులిచ్చి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వెల్లడించారు.కేంద్రం వ్యవస్థలను అనేక రకాలుగా వాడుకుంటుందని మండిపడ్డారు.
వ్యవస్థను మనం కాపాడుకుంటే.ఆ వ్యవస్థే మనల్ని కాపాడుతుందని ఆమె స్పష్టం చేశారు.