టాలీవుడ్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించగా ఆ వార్తలు అన్ని అవాస్తవాలే అని కొట్టి పరేసింది పవిత్ర లోకేష్.
ఆ తర్వాత వీరిద్దరూ అనేకసార్లు కెమెరాకు కలిసి కనిపించడంతో వీటిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.అయితే సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్స్ మితిమీరడంతో పాటుగా వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అంటూ ఇటీవలే పవిత్ర లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మార్ఫింగ్ ఫొటోలు, అసభ్య పదజాలంతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు జారీ చేసారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది.నటుడు నరేశ్ మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.తమను ట్రోలింగ్ చేస్తోన్న కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు , కొంతమంది వ్యక్తుల పై ఆయన క్రిమినల్ డిఫర్మేశన్ వేశారు.దీని పై విచారించిన కోర్టు పవిత్ర, నరేశ్ లపై ట్రోలింగ్‌కు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానెళ్లు, వ్యక్తులపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయమై వారికి నోటీసులు కూడా జారీ చేసింది.కోర్టు ఆదేశాలకు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు పవిత్ర లోకేష్ నరేష్ లపై ట్రోలింగ్స్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై విచారణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారని, అంతేకాకుండా ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సృష్టించడంతోపాటు వారిపై దారుణంగా ట్రోల్స్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారు.అంతేకాకుండా ఇలా ట్రోల్స్ చేయడం వెనుక నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి కూడా ఉంది అంటూ పవిత్ర లోకేష్ ఆమెపై కూడా ఫిర్యాదు చేసింది.