వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాలు పోటీ పడనున్నాయి.చిన్న సినిమాలతో పాటు పెద్ద పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి పండుగ విడుదల కానున్నాయి.
సరిగ్గా నెల రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి పండుగతో పాటు అసలైన పండగ వాతావరణం నెలకొనబోతోంది.టాలీవుడ్ అగ్ర హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా అలాగే అగ్ర హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలతో పాటుగా తమిళ హీరో విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా కూడా విడుదల కానుంది.
అలాగ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు కూడా డబ్బింగ్ అయ్యి తెలుగులో విడుదల కాబోతోంది.
ఈ నాలుగు సినిమాలతో పాటు రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నాలుగు సినిమాల బడ్జెట్ కి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ నాలుగో సినిమాల బడ్జెట్ విషయానికి వస్తే.
అన్నింటి కంటే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన సినిమా వారసుడు. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ వారసుడు సినిమా ఏకంగా 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందినట్లుగా తెలుస్తోంది.

వారసుడు సినిమాలో హీరో విజయ్ కే దాదాపు వంద కోట్లకు పైగా పారితోషికం వచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ సినిమా తర్వాత అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య 140 కోట్ల రూపాయల బడ్జెట్ తో వాల్తేరు వీరయ్య సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు రూపొందించినట్లు తెలుస్తోంది.అలాగే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను 110 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందినట్లు తెలుస్తోంది.అలాగే అజిత్ నటించిన తునివు సినిమా కూడా వంద కోట్లకు పైగానే బడ్జెట్ తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి పండుగకు కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్న ఈ నాలుగు సినిమాలు అన్నీ కూడా వందల కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.మరి కోట్ల బడ్జెట్ నిర్మితమైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయో చూడాలి మరి.ఈ నాలుగు సినిమాలు కూడా మూడు రోజుల గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.దాదాపుగా ఆరు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు ఈ సంక్రాంతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయట.







