ఒకప్పుడు కామెడీ సినిమాలతో అల్లరి నరేష్( Allari naresh ) నటుడిగా ఒక వెలుగు వెలిగారు.అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ఒపీనియన్ ప్రేక్షకుల్లో సైతం ఉండేదనే సంగతి తెలిసిందే.
అల్లరి నరేష్ ప్రస్తుతం బచ్చలమల్లి( Bachala Malli) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో ఆయన సీరియస్ రోల్ లో కనిపించనున్నారు.అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
![Telugu Allari Naresh, Bachala Malli, Multirer, Theatrical, Rajesh Danda, Tollywo Telugu Allari Naresh, Bachala Malli, Multirer, Theatrical, Rajesh Danda, Tollywo](https://telugustop.com/wp-content/uploads/2024/06/viral-allari-naresh-bachala-malli-movie-non-theatrical-rights-tollywood-multistarrer-movies.jpg)
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాత్రం 5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.ఈ మధ్య కాలంలో విడుదలైన అల్లరి నరేష్ సినిమాలలో ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.అల్లరి నరేష్ ప్రస్తుతం రూట్ మార్చి భిన్నమైన సినిమాలలో నటిస్తున్నారు.
![Telugu Allari Naresh, Bachala Malli, Multirer, Theatrical, Rajesh Danda, Tollywo Telugu Allari Naresh, Bachala Malli, Multirer, Theatrical, Rajesh Danda, Tollywo](https://telugustop.com/wp-content/uploads/2024/06/viral-allari-naresh-bachala-malli-movie-non-theatrical-rights-Rajesh-Danda-multistarrer-movies.jpg)
టాలెంట్ ఉన్న హీరో కావడంతో ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతూ ఈ నటుడు ఆకట్టుకుంటున్నారు.బచ్చలమల్లి సినిమాతో అల్లరి నరేష్ క్రేజ్ ను పెంచుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అల్లరి నరేష్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటించడానికి అంగీకరిస్తున్నారు.అల్లరి నరేష్ పారితోషికం కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.అల్లరి నరేష్ బచ్చలమల్లి మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.బచ్చలమల్లి సినిమాకు ప్రమోషన్స్ సైతం భారీ స్థాయిలో జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సుబ్బు డైరెక్షన్ లో రాజేష్ దండా నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.ఈ మధ్య కాలంలో నిర్మాతగా రాజేష్ దండా తన ట్రాక్ రికార్డ్ తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విషయంలో సైతం ఆయన నమ్మకం నిజమవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.