పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu )సినిమాను ఏ క్షణాన మొదలుపెట్టారో తెలీదు కానీ ఈ సినిమాకు ఎదురైనన్నీ ఆవాంతరాలు ఏ సినిమాకు ఎదురు కాలేదు.ఈ సినిమా కంటే ఆలస్యంగా మొదలైన ఎన్నో సినిమాలు సైతం షూటింగ్ ను పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలయ్యాయి.
అయితే హరిహర వీరమల్లు మాత్రం ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లను వాయిదా వేసుకుంటూ ఆలస్యమవుతోంది.
![Telugu Ratnam, Arjun Rampal, Bobby Deo, Harihara, Jyothi Krishna, Tollywood-Movi Telugu Ratnam, Arjun Rampal, Bobby Deo, Harihara, Jyothi Krishna, Tollywood-Movi](https://telugustop.com/wp-content/uploads/2024/06/viral-Hari-Hara-Veera-Mallu-Bobby-Deo-Arjun-Rampal-Krish-Jyothi-Krishna-tollywood.jpg)
ఇప్పటికే ఈ సినిమా నుంచి క్రిష్( Krish Jagarlamudi ) తప్పుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ తప్పుకున్నారు.డీవోపీ జ్ఞానశేఖర్ ఈ సినిమా నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో మనోజ్ పరమహసంస వచ్చారు.
గతంలో ఈ సినిమా నుంచి అర్జున్ రాంపాల్( Arjun Rampal ) తప్పుకోగా ఆయన స్థానంలో బాబీ డియోల్ నటిస్తున్నారు.ఈ సినిమాకు ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్నారు.
![Telugu Ratnam, Arjun Rampal, Bobby Deo, Harihara, Jyothi Krishna, Tollywood-Movi Telugu Ratnam, Arjun Rampal, Bobby Deo, Harihara, Jyothi Krishna, Tollywood-Movi](https://telugustop.com/wp-content/uploads/2024/06/Hari-Hara-Veera-Mallu-Bobby-Deo-Arjun-Rampal-Krish-Jagarlamudi-Jyothi-Krishna-tollywood.jpg)
జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు అన్నీ డిజాస్టర్లుగా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి.హరిహర వీరమల్లు సినిమాకు జ్యోతికృష్ణ( Jyothi Krishna ) ప్లస్ కారని మైనస్ అవుతారని చాలామంది ఫీలవుతున్నారు.ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.జ్యోతికృష్ణ కెరీర్ ను సైతం ఈ సినిమా డిసైడ్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఎప్పటినుంచి డేట్స్ కేటాయిస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.ఎన్నికల ఫలితాల ఆధారంగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉండబోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కు పిఠాపురంలో అనుకూల ఫలితాలు వస్తాయో వ్యతిరేక ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.ఒకింత భారీ బడ్జెట్ తోనే హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది.