ఎగ్స్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ఎగ్ తో వివిధ రకాల వెరైటీస్ చేసుకొని తింటుంటారు.
అయితే ప్రతిరోజు ఒక ఎగ్ తినడం ద్వారా మన శరీరానికి ఎన్నో పోషక విలువలు అందుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎగ్స్ ను ఎన్నో రకాలుగా, ఎంతో రుచిగా తింటారు.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఎగ్స్ ను తినడం వల్ల మన శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను నిలకడగా ఉండేలా ఎగ్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
బరువును నియంత్రించడంలో కూడా ఎగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి.కొద్ది పరిమాణంలో ఎగ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి ఇతర ఆహారపదార్థాల వైపు మనసు వెళ్లకుండా ఆపుతుంది.
ప్రతిరోజు మన ఆహారంలో ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి.అంతేకాకుండా ఎగ్ లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి.
అధిక మొత్తంలో రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది.ఎగ్స్ తయారు చేసుకునే విధానం లో వివిధ రకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే అన్ని రకాల నూనెలలో ఓకే రకమైన ఫ్యాట్ ను కలిగి ఉండదు.కొన్ని నూనెలు వంటల్లో వాడటం వల్ల అధిక బరువు పెరుగుతారు.
మరికొద్ది నూనెలలో తక్కువగా కలిగి ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి దోహదపడతాయి.ఎగ్స్ సోయాబీన్ ఆయిల్ ఉపయోగించి చేయటం ద్వారా శరీర అధిక బరువు పెరగటానికి దోహద పడుతుంది.
కానీ ఎగ్స్ ను కొబ్బరి నూనె ఉపయోగించి చేయటం ద్వారా మన నడుము చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.చెడు కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల అనేక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని పరిశోధకులు తెలియజేస్తున్నారు.