యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించి, ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండల, గ్రామ పంచాయతీల్లో జాబితాను ప్రదర్శించడం జరిగిందని,ఈముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 న అన్ని మండలాల్లో అభ్యంతరాలు స్వీకరిస్తారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని మినీ మీటింగ్ హల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 426 గ్రామ పంచాయతీలు,3698 వార్డులు ఉండగా,రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 3698 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.12 న వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని,2024 డిసెంబర్ 13 వరకు వినతులు,అభ్యంతరాల ప్రక్రియ ఉంటుందని,తుది ఓటరు జాబితాను 2024 డిసెంబర్ 17న ప్రచురించనున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి నాగిరెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి సునంద,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.