తిప్పర్తిలో జూ.కళాశాల స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో జూనియర్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తిప్పర్తి మండల కేంద్రంలో పర్యటించి పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.

 Ila Tripathi District Collector Inspected The Site Of The Junior College In Tipp-TeluguStop.com

స్థల సేకరణ విషయమై ముందుగా సర్వే నెంబర్ 515,516 లో మోడల్ స్కూల్ పక్కన ఉన్న 3 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణానికి తనిఖీ చేశారు.అనంతరం 827 సర్వేనెంబర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

ఆ తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 555,556,560 సర్వే నెంబర్లలో ఉన్న స్థలాలను పరిశీలించి రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు.రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు అనువైన స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉందని,గుర్తించిన స్థలాలకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని తహసిల్దార్ పుష్పను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ వెంట మండల స్పెషల్ ఆఫీసర్,మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి,ఎంపీడీవో వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube