యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబం దగ్గరకు ప్రభుత్వ అధికారులు వచ్చి సర్వే నిర్వహిస్తారని,ప్రస్తుతం ఉంటున్న ఇండ్లను,సొంత స్థలం ఉన్న వారిని గుర్తించి ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారని,ఆ తర్వాత గ్రామపంచాయతీలో గ్రామసభల ద్వారా అర్హులను అనర్హులను గుర్తించి,సంబంధిత జిల్లా మంత్రికి లబ్ధిదారుల వివరాలను పంపిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.
మంగళవారం గుండాల తాహాసిల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి తహాసిల్దార్, మండల పరిషత్,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు సంబంధించిన లాగిన్ సమస్యలపై అవగాహన కల్పించారు.
అనంతరం మాట్లాడుతూ ఈ నెల చివరిలోగా లబ్ధిదారులు ఎంపిక పూర్తి అవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ జల కుమారి, డిప్యూటీ తాహాసిల్దార్ నీలిమ,సూపర్డెంట్ మల్లయ్య,ఇన్చార్జ్ ఎంపీవో ధనుంజయ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.