బుద్ధవనంలో ధమ్మ విజయం వేడుకల్లో పాల్గొన్న గుత్తా

నల్లగొండ జిల్లా:

(Nalgonda)నేటి తరానికి బౌద్ధం చరిత్ర తెలియడం కోసం దమ్మ విజయం వేడుకలు నిర్వహించడం అవసరమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy)అన్నారు.సోమవారం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్(Nagarjunasagar) లోని బుద్ధవనంలో ధమ్మ విజయం వేడుకల్లో ఆయన ముఖ్యాతిధిగా పాల్గొని మాట్లాడుతూ బౌద్ధం అనగానే మనకు గౌతమ బుద్ధుడు,ఆయన ప్రజలకు చేసిన బోధనలు గుర్తుకొస్తాయన్నారు.

 Gutta Participated In Dhamma Victory Celebrations In Buddhavanam, Gutta Sukhende-TeluguStop.com

సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి బుద్ధుడు బోధనలు చేసారని,అంతటి మహనీయులని ఆదర్శంగా తీసుకొని బౌద్ధంపట్ల ఆకర్షితుడైన మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ(Mauryan Emperor Ashoka Kalinga) యుద్ధం వలన జరిగిన అపార ప్రాణనష్టం పట్ల చలించి యుద్ధాల వల్ల సమకూరే దిగ్విజయాల కన్నా బుద్ధుని దమ్మ బోధనల వల్ల కలిగే దమ్మ విజయం మేలని విజయదశమి (Vijayadashami)రోజున బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భాన్ని వివరించారు.దసరా సందర్భంగా ధమ్మ విజయం వేడుకలను నిర్వహించడం ద్వారా నేటి యువతకు చరిత్ర గురించి తెలుస్తోందన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత,బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ (Baba Saheb Dr.B.R.Ambedkar)కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి దేశ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు.ఇంతటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

ఈ వేడుకల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వెన్ ధర్మ రక్షిత చైర్మన్ మోక్షానంద,బుద్ధ విహార, టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, పి.ఎస్.ఎన్.మూర్తి,రాజా ఫౌండేషన్ అడ్వైజర్ లత, సబ్ కలెక్టర్ మిర్యాలగూడ,బుద్దవనం ప్రాజెక్ట్ ఓఎస్డి సుధన్ రెడ్డి, వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube