BCCI : బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ లో ఏఏ ఆటగాళ్లకు ఏఏ గ్రేడులు దక్కాయంటే..?

బీసీసీఐ( BCCI ) తాజాగా 2024 సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.బోర్డును ధిక్కరించిన ఆటగాళ్లకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Bcci Announced Annual Contracts For Indian Cricketers-TeluguStop.com

భారత జట్టు యువ ఆటగాళ్లయిన ఇషాన్ కిషన్,( Ishan Kishan ) శ్రేయస్ అయ్యర్లు( Shreyas Iyer ) జాతీయ జట్టుకు ఆడినప్పుడు దేశవాళి క్రికెట్ లో ఆడాలని బీసీసీఐ వీరిని సూచించింది.అయితే ఈ ఆటగాళ్లు రంజీ మ్యాచ్ లో ఆడకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది.

ఇక వారిద్దరిపై కాంట్రాక్టుల్లో వేటు వేసింది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ లో ఏఏ ఆటగాళ్లకు ఏఏ గ్రేడులు దక్కాయో తెలుసుకుందాం.A+ గ్రేడ్ లో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు.వారు ఎవరంటే.

రోహిత్ శర్మ,( Rohit Sharma ) విరాట్ కోహ్లీ,( Virat Kohli ) రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా. శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ లకు A గ్రేడ్ ప్రమోషన్ దక్కింది.

ఇక వీరితో పాటు A గ్రేడ్ లో ఎవరు ఉన్నారంటే.మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, హార్థిక్ పాండ్యా లు ఉన్నారు.

B గ్రేడ్ లో ఎవరు ఉన్నారంటే.యశస్వి జైస్వాల్,( Yashasvi Jaiswal ) సూర్య కుమార్ యాదవ్,( Surya Kumar Yadav ) రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.C గ్రేడ్ లో ఎవరు ఉన్నారంటే.తిలక్ వర్మ, రింకూ సింగ్, రజత్ పాటిదార్, అవేష్ ఖాన్, కేఎస్ భరత్, ప్రసిద్ధ కృష్ణ, రుతురజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, ఆర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, శివం దూబే, జితేశ్ శర్మ, రవి బిష్ణోయి ఉన్నారు.

ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ కు వస్తే.ఆకాష్ దీప్, ఉమ్రాన్ మాలిక్, విద్వంత్ కావేరప్ప, విజయ్ కుమార్, యశ్ దయాళ్ లకు చోటు దక్కింది.ఈ కాంట్రాక్టులు 2024 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube