కేసీఆర్ తో సహా నాటి మంత్రులను మొత్తం అరెస్టు చేయాలి: టీజేఎస్ నేత కొల్లు కృష్ణారెడ్డి

సూర్యాపేట జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాగ్ నివేదిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి క్యాబినెట్ మంత్రులందరినీ వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు కొల్లు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో టీజేఎస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసిఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మొదటి నుండి ఆధారాలతో సహా చెబుతున్నాడని,

 All Brs Ministers Including Kcr Should Be Arrested Tjs Leader Kollu Krishna Redd-TeluguStop.com

అయినా ఏవీ లెక్క చేయని కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి వేలకోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారని విమర్శించారు.

తాము గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన ఘట్టమైన మేడిగడ్డ పునాదుల నుండి నేర్రలు బాసి కృంగిపోయిందని ఈరోజు ఆ ప్రాజెక్టు ఉపయోగం లేకుండా పోయిందని,దాని ఆధారంగా నిర్మించిన మిగతా బ్యారేజీలు, లిఫ్టులు,రిజర్వాయర్లు వాటి కోసం వెచ్చించిన వేలకోట్ల రూపాయలు వృధా అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ హయాంలో జరిగిన తప్పును ఒప్పుకొని ప్రజలను బహిరంగ క్షమాపణ కోరాల్సింది పోయి ఇంకా కేసీఆర్ దబాయింపులకు, బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాగ్ నివేదికపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రైతు జన సమితి జిల్లా ఉపాధ్యక్షుడు తండు రాములు గౌడ్,ఎస్టి సెల్ జిల్లా కార్యదర్శి జాటోతు శ్రీనునాయక్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, యువజన సమితి ఆత్మకూరు మండల అధ్యక్షుడు గడ్డం యాకోబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube