చుట్టూ సెక్యూరిటీ వున్నా భయంతో వణికిపోయిన చైనా అధ్యక్షుడు.. విషయమిదే!

అవును, మీరు విన్నది నిజమే.అదేంటి ఎప్పుడూ భయపెట్టడమే కానీ, భయ పడడం తెలియని చైనా అధ్యక్షుడు( China President ) భయపడ్డడా? ఎమన్నా కలగన్నారా? అని అనుకోకండి! అవును, ఇక్కడ మీరు చదివింది అక్షరాలా నిజం.ఏకంగా ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌( Xi Jinping ) భయపడ్డారా? అయితే అంత శక్తివతమైన దేశానికి అధ్యక్షుడిని భయపెట్టిన అంశం ఏమిటి? ఏ సందర్భంలో భయపడ్డారు? అనే అంశాలు మీ మెదడులో మొదలు కావచ్చు.విషయం తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనం చదవాల్సిందే.

 Chinese President Xi Jinping Guards Stopped By South African Officers At Brics 2-TeluguStop.com

ఇక సోషల్‌ మీడియాలో చైనా అధ్యక్షుడు భయపడిన వీడియో విషయంలోకి వెళితే, జిన్‌పింగ్‌.దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు( BRICS Summit ) హాజరయ్యారు.ఈ క్రమంలో తన గది నుంచి సమావేశ మందిరానికి వెళ్లేందుకు ప్రత్యేక భద్రత ఉన్న మార్గం ఏర్పాటు చేయడం జరిగింది.బ్రిక్స్‌ దేశాల అధినేతలంతా ఈ మార్గం గుండానే సమావేశానికి హాజరయ్యారు.

జిన్‌పింగ్‌ కూడా సదస్సులో పాల్గొనేందుకు ఓ హాల్‌ వైపు నడుచుకుంటూ వెళుతుండగా, ఆయన వెంట వచ్చిన డెలిగేట్స్, సెక్యూరిటీ సిబ్బందిని( Security Officers ) హాలు ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది.బలవంతంగా అతడ్ని అడ్డుకుంటున్నట్లు కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది.

అదే ఎక్స్ట్రా అనుకుంటే ఆ వెంటనే ఎంట్రన్స్‌ గేట్స్ కూడా మూసేశారు.దీంతో కాస్త ఇబ్బందిగా ముందుకెళ్లిన జిన్‌ పింగ్‌. కొద్ది సేపు నిలుచుండి ఆలోచిస్తూ ఉండిపోయారు.అతనికి కాసేపు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు.ముందుకు అడుగు వేయడానికి కూడా తడబడ్డారు.అయోమయంతో వెనక్కి తిరిగి చూసి నడుచుకుంటూ ముందుకెళ్లి పోయారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.తామే బలవంతులం అనుకునే వారు.

ఇలా భయపడడం ఏంటి? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ! అన్నట్టుంది యవ్వారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube