మహారాష్ట్రలోని పుణెలో నిషేధిత డ్రగ్స్ భారీగా పట్టుబడ్డాయి.ఈ మేరకు రూ.51 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఐదుగురును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్న కారులో డ్రగ్స్ పట్టుబడిందని సమాచారం.డ్రగ్స్ ను అక్రమంగా వివిధ రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని డ్రగ్స్ తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది.