మరోసారి డేంజర్ జోన్ లోకి కడెం ప్రాజెక్ట్

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.పై నుంచి వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో కడెం ప్రాజెక్ట్ మరోసారి డేంజర్ జోన్ లోకి వెళ్లిందని తెలుస్తోంది.

 Kadem Project Into The Danger Zone Once Again-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 18 గేట్లలో 14 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.అదేవిధంగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3,87,000 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2,47,000 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయించగా కడెం గ్రామ ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

అయితే ప్రాజెక్ట్ డేంజన్ జోన్ లోకి వెళ్లే వరకు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube