మరోసారి డేంజర్ జోన్ లోకి కడెం ప్రాజెక్ట్

ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది.

పై నుంచి వరద ఉధృతి ఎక్కువగా కొనసాగుతుండటంతో కడెం ప్రాజెక్ట్ మరోసారి డేంజర్ జోన్ లోకి వెళ్లిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 18 గేట్లలో 14 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

అదేవిధంగా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3,87,000 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2,47,000 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది.

ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయించగా కడెం గ్రామ ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

అయితే ప్రాజెక్ట్ డేంజన్ జోన్ లోకి వెళ్లే వరకు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఆడపిల్లలకు అన్యాయం జరిగితే కోపం వస్తుంది.. బన్నీ సంచలన వ్యాఖ్యలు వైరల్!