శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర

నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో మలిదశ తెలంగాణ ఉద్యమ నిప్పుకణం, అమరుడు శ్రీకాంతచారి వర్ధంతి వేడుకలు తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ (టీ.ఎస్.

 Srikantachari's Sacrifice Is The History Of Telangana Malidasa Movement-TeluguStop.com

యూ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు.

అనంతరం టీ.ఎస్.యూ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సంపత్ మాట్లాడుతూ శ్రీకాంతా చారి వర్ధంతి జరుపుకోవడం మాత్రమే కాదని,ఆయన చరిత్రను నేటి విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.శ్రీకాంతాచారి వీర మరణం వల్లే ఉద్యమం ఇంత పెద్దఎత్తున ఎగసిపడి ప్రపంచం మొత్తం మన తెలంగాణ వైపు చూసేలా చేసిందని అన్నారు.

కనీసం విద్యార్థులకు ఆ విషయాలు తెలియకపోవడం రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యంగా భావించాలన్నారు.తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవిత చరిత్రలను పుస్తకాల రూపంలో ప్రచురించి,పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రతి విద్యార్థి అమరుల త్యాగాల గురించి తెలుసుకునే విధంగా చర్య తీసుకోవాలన్నారు.కానీ,నేడు నాయకులకి లిక్కర్ స్కామ్ లు చేయడానికి,వందల కోట్లు సంపాదించుకోవడానికి సమయం ఉంది కానీ,ఆనాడు ఉద్యమంలో ఊపిరిలు వదిలిన ఎంతో మంది అమరుల కుటుంబాలను ఆదుకోవడానికి కానీ, వారివైపు కన్నెత్తి చూడటానికి సమయం లేదని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం శ్రీకాంతాచారి జయంతి మరియు వర్దంతులను అధికారికంగా చేయాలని కోరారు.లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందన్నారు.ఈ కార్యక్రమంలో టీ.ఎస్.యూ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube