ఇక కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టనున్నాడా?

రెండో సార్వత్రిక ఎన్నికల వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా బలంగా ఉంది.అప్పట్లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న పరిస్థితి ఉంది.

 Will Ktr Focus On Party Structure At The Field Level, Ktr, Trs Party, Telangana-TeluguStop.com

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.అయితే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది.

ప్రతిపక్షాలు ఒకప్పటి కంటే పూర్తి భిన్నంగా తయారయిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలని తాజాగా జరిగిన మీటింగ్ లో కేటీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రతిపక్షాలు రోజు రోజుకు బలపడుతుండటం, అంతేకాక ఇప్పట్లో పెద్దగా ఎన్నికలు లేవు కాబట్టి ఇదే పార్టీ నిర్మాణానికి తగిన సమయం అని టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.  అయితే ఇప్పటి వరకు చాలా ప్రభుత్వం పరంగా దృష్టి సారించినా ఇప్పుడు కూడా పార్టీ పరంగా దృష్టిసారించకపోతే వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

అయితే ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యమ కారులు ఉన్నారు.

వాటిపై ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.

త్వరలోనే పార్టీకోసం అహర్నిశలా కష్టపడ్డ నాయకులకు తప్పక న్యాయం జరుగుతుందని ఎవరూ అధైర్యపడవద్దని కెటీఆర్ కొంత మనో ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.

Telugu @cm_kcr, @ktrtrs, @trspartyonline, Telangana-Political

అంతేకాక రానున్న రోజుల్లో జిల్లాల వారీగా నాయకులతో, కార్యకర్తలతో భేటీ అయి జిల్లాలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని, పార్టీ పరిస్థితిని తెలుసుకొని ముందుకెళ్ళే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.జిల్లాలో గతంతో పోలిస్తే ప్రతిపక్షాల ఎత్తుగడలు ఏమిటి, ఏయే అంశాలలో పార్టీ వెనుకబడి ఉంది ఇలా చాలా రకాల విషయాలపై కెటీఆర్ దృష్టి పెట్టె అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube