రేవంత్ కు ఆ విషయంలో ఝలక్ ఇచ్చిన కేటీఆర్

తెలంగాణ రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య హాట్ హాట్ గా సాగుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం.డ్రగ్స్ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కు మధ్య ట్వీట్ వార్ జరిగిన విషయం మనం చూసాం.

 Ktr Who Gave Jhalak To Rewanth In That Regard,ktr, Revanth Reddy, Trs Party, Rew-TeluguStop.com

రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సినీ హీరోయిన్ లతో సంబంధాలు ఉన్నాయని, గోవాలో డ్రగ్స్ సేవించారని కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.దీనికి కౌంటర్ గా రేవంత్ అదే తరహా వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ రేవంత్ పై కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది.

కేటీఆర్ పిటిషన్ ను విచారించిన కోర్టు కేటీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దు అని రేవంత్ కు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటి వరకు రేవంత్ మాటకు మాట వస్తుందకున్న కోర్టు వరకు వెళ్లే విషయాన్ని ఊహించి ఉండరు.

అంతేకాక కేటీఆర్ కూడా త్వరలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించబోతున్న నేపథ్యంలో ఇక పార్టీ పరంగా ప్రతిపక్షాలకు కౌంటర్ వెళ్లే అవకాశం ఉంది.ఇక అప్పటి నుండి ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోర్టు ఆదేశాలతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది.ప్రస్తుతం అయితే రేవంత్ తన దూకుడుని తగ్గించుకునే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.

Telugu @ktrtrs, @trspartyonline, Congress, Rewanth, Telangana-Political

ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో తన పంథాలోనే ముందుకు సాగుతూ తన వ్యూహాలను అమలు చేస్తూ కార్యకర్తలకు భవిష్యత్తుపై భరోసా ఇస్తూ, ఉత్సాహ పరుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి రేవంత్ రెడ్డి, కెటీఆర్ వ్యాఖ్యల వార్ ఇక్కడితోనే ఆగుతుందా,  మరింత ముందుకెళ్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube