పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు.గతంలోనే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కి కరోనా రావడం తెలిసిందే.
దీంతో సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఆయన .తాజాగా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు శ్వాస తీసుకోవటం ఇబ్బందికరంగా మారటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.ఈ క్రమంలో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో హైదరాబాదులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటంతో .కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలుపుతున్నారు.
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ టీం అధికారికంగా ప్రకటించడం జరిగింది.దీంతో సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కోలుకోవాలని భగవంతునికి ప్రార్థనలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
నెటిజన్లు మరియు అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ డ్యూటీ చేసినా చాలామంది కరోనా బారిన పడటం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.
అయితే తాజాగా ఆయన ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ ఉండటంతో టెస్టులు.చేయటంతో కరోనా పాజిటివ్ రిపోర్ట్ రావటం జరిగింది.
దేశంలో సామాన్యుల నుండి చాలామంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ కి రావడంతో ఈ వార్త ఇప్పుడు రాజకీయాలలో మరియు సినిమా రంగంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.