విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే.మరోపక్క మహమ్మారి కరోనా దెబ్బకీ భారీగా ఖజానా కి చిల్లు పడింది.
దీంతో చాలా వరకు కేంద్రంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చకుండా .ఇష్టానుసారంగా గత పది సంవత్సరాల నుండి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ఇంకా విశాఖపట్టణానికి రైల్వేజోన్ తదితర అంశాలలో ఏపీకి మొండిచేయి చూపించడం జరిగింది.
ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఉండగా.కరోనా వ్యాక్సిన్ విషయంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది.
మేటర్ లోకి వెళితే 18 సంవత్సరాలు పైబడిన వాళ్లకి మే ఫస్ట్ నుండి కరోనా వ్యాక్సిన్ అందించవచ్చని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని సరికొత్త ఆదేశాలు ఇచ్చింది.కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై సుమారు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల ఆర్ధిక భారం పడుతుందని ఆర్ధిక శాఖ లెక్కలు తేల్చింది.దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నాగాని కేంద్రం ఈ రీతిగా వ్యవహరించడం పట్ల .ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.