మంగళగిరిలో జయహో బీసీ సభ( Jayaho BC Public Meeting )కి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకు( TDP and Janasena ) చెందిన నేతలు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తూ.వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో బీసీల పొట్ట కొట్టారని ఆరోపించారు.30 లక్షలకు పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టడం జరిగింది.2019 ఎన్నికల ప్రచారం సమయంలో ఏలూరులో వైసీపీ బీసీ డిక్లరేషన్( YCP BC Declaration ) ప్రకటించి అధికారంలోకి వచ్చాక బీసీలను నట్టేట ముంచారని విమర్శించారు.బీసీలు సంక్షేమానికి ఎన్నో హామీలు ప్రకటించే అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేదని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండి పడటం జరిగింది.
ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని దాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.బడ్జెట్ లో మూడవ వంతు బీసీలకు కేటా ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు.దాదాపు 20 నుంచి 30 వేల మంది దాకా బీసీలపై అక్రమ కేసులు( Illegal Cases ) బనాయించారు.
అచ్ఛేనాయుడు లాంటివారు కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.బీసీలకు కార్పొరేషన్లు ప్రకటించి కుర్చీలు కూడా ఇవ్వలేదు.వారికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.వైయస్ జగన్ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ సంస్కృతికి బీసీలు వెన్నెముక లాంటి వారిని అభివర్ణించారు.తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.